చర్యలు – రైతుల నుండి ఎక్కువగా ఫిర్యాదులు హుజూర్ నగర్ ఫిబ్రవరి 10 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం అన్ని చర్యలు చేపడుతుందని రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ దిలీప్ కుమార్ తెలిపారు. శుక్రవారం హుజూర్ నగర్ లోని డి.ఈ విద్యుత్ కార్యాలయంలో వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం నాలుగు సి జి ఆర్ ఎఫ్ విభాగాలుగా విభజించిందని తెలిపారు. ఈ నాలుగు విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించనున్నట్లు దిలీప్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు తమ పరిధిలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలలో 650 ఫిర్యాదులు తాము స్వీకరించినట్లు తెలిపారు. అందులో 500 ఫిర్యాదులను పరిష్కరించినట్టు వివరించారు. ప్రతి ప్రాంతంలో రైతుల నుండి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, కనెక్షన్లు, వైర్లు ఏర్పాటు చేయకపోవడం తదితర అంశాలపై ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం విద్యుత్ సంస్థను నాలుగు సిజిఆర్ఎఫ్ విభాగాలుగా విభజించి ప్రతి విభాగానికి జ్యూడిషియల్ అధికారాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి డీఈ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించి అక్కడే సమస్యను పరిష్కరించవలసి ఉంటుంది. ఫిర్యాదు అందిన తర్వాత నిర్దిష్ట కాల వ్యవధిలో సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నట్లు తెలిపారు. అక్కడ పరిష్కారం కాకపోతే వినియోగదారుడు సిజిఆర్ఎఫ్ కు ఫిర్యాదు చేయాలని అని తెలిపారు. అక్కడ తమ పరిధిలో అధికారులను, వినియోగదారులను పిలిచి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఆ పరిష్కారం నచ్చకపోతే వినియోగదారుడు విద్యుత్ శాఖలో ఉన్న అత్యున్నత హోం అంబుడ్స్ మెన్ కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. సమస్యను అధికారులు పరిష్కరించకపోతే జరిమానా విధించే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు అనేకమంది తమ పంట పొలాల చుట్టూ తీగలు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నారని దీనివలన పశువులు, మనుషులు చనిపోతే చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. సి జి ఆర్ ఎఫ్ చైర్మన్ ఇచ్చిన ఆదేశాలను అధికారులు విధిగా పాటించాలని చైర్మన్ దిలీప్ కుమార్ తెలిపారు. సమస్యల పరిష్కారంలో పారదర్శకత ఉండాలని తెలిపారు. ప్రతి సమస్యను నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించాలని ఆయన కోరారు. హుజూర్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో పలువురు నుండి చైర్మన్, ఇతర సిబ్బంది ఫిర్యాదులు స్వీకరించి నమోదు చేశారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బోర్డు టెక్నికల్ అధికారి నాగేశ్వరరావు, జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ పాల్ రాజ్, హుజూర్ నగర్ డిఈ వెంకట కృష్ణయ్య, సూర్యాపేట డిఇ శ్రీనివాస్, ఏ డి ఈ సక్రు నాయక్, అధికారులు రాంప్రసాద్, వెంకన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.




