హుజూర్ నగర్ ఏప్రిల్ 20(జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని తిలక్ నగర్ నందు మాల మహానాడు సూర్యాపేట జిల్లా కార్యదర్శి, బీఆర్ఎస్ యువ నాయకుడు కోల్లపూడి శ్రీనాథ్ సుజాత కుమారుడు శ్రీమన్ పుట్టినరోజు సందర్భంగా గురువారం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన కుడితోట్టి నాగార్జున కి 25 కేజీల బియ్యం, కోల్లపూడి సుధాకర్ కు 25 కేజీల బియ్యం అందచేశారు. ఈ సందర్భంగా శ్రీనాథ్ మాట్లాడుతూ నా కుమారుడు శ్రీమన్ పుట్టినరోజు సందర్భంగా పేద కుటుంబాలకు ఎంతో కొంత సహాయం చేయటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో దగ్గుపాటి బాబురావు, కోల్లపూడి శ్యామ్, మామిడి రాజేష్, లచ్చిమళ్ళ సైదులు, కోల్లపూడి సతీష్, కోల్లపూడి ఇస్సాక్, హరీష్, ప్రశాంత్, మహేష్, ఇరిమియా తదితరులు పాల్గొన్నారు.




