Wednesday, 4 November 2026

హిమాచల్ ప్రదేశ్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో సి.పి.ఎస్ విధానం రద్దు చేయాలిశిరందాసు రామదాసు జిల్లా అధ్యక్షులుతెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం

 

 

 

 

 

 

 

కొండమల్లేపల్లి ఏప్రిల్ 20 జనంసాక్షి న్యూస్ : స్థానిక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ లక్షా ముప్పై ఆరు వేల సి.పి.ఎస్ ఉద్యోగ కుటుంబాల ఆకాంక్షను గుర్తించిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో మే15,2003 నుండి నియామకం ఐన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరరిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్  నేతృత్వంలో కేబినెట్ ఆమోదించడం శుభపరిణామం అన్నారు హిమాచల్ ప్రదేశ్ తరహాలో మన రాష్ట్రంలో కూడా లక్షా డెబ్బై ఆరువేల సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం మన ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి ఐన కేసిఆర్ సిపిస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఇప్పటికే గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఎన్నికలలోపు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తుందని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని తెలిపారు