బెల్లంపల్లి, ఏప్రిల్ 18, (జనంసాక్షి )ఆల్ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ఆల్ ముస్లిం మైనారిటీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని 18వ వార్డులో బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ చేతుల మీదుగా రంజాన్ కానుకల పంపిణి చేశారు.
రంజాన్ పండుగను పురస్కరించుకొని 50 మంది నిరుపేదలకు చీరలు, సేమియాలు పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలనుండి అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్న ఆల్ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ సేవలు అభినందనీయం అన్నారు. ఈకార్యక్రమంలో చిట్యాల మధు, దామెర కిరణ్, గురుడ్ల సత్యనారాయణ, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యంఎ అజీజ్, రాష్ట్ర అధ్యక్షులు అన్వర్ ఖాన్, పట్టణ అధ్యక్షులు రసూల్ షరీఫ్, ఖ్వాజ మొయినుద్దీన్, యండి జాఫర్, యూత్ ప్రెసిడెంట్ ఫెరోజ్ ఖాన్, రషీద్ ఖాన్, అహ్మద్ హుస్సేన్, ఉబ్బు ఉబెద్, షాదఫ్ షమీమ్ తదితరులు పాల్గొన్నారు.




