Wednesday, 4 November 2026

వీవోఏల రిలే నిరాహార దీక్షలు.

 

 

 

 

నెన్నెల, ఏప్రిల్ 18, (జనంసాక్షి )నెన్నెల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు తమ సమస్యల సాధనకు మంగళవారం వీవోఏలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. వీవోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26 వేలు చెల్లించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉద్యోగభద్రత కల్పించాలని, అర్హులైన వీవోఏలను సీసీలుగా పదోన్నతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో వీవోఏ యూనియన్ మండల అధ్యక్షుడు తైదల సమ్మయ్య, కోశాధికారి సింగతి కవిత, నియోజకవర్గ కోశాధికారి దుర్గం మల్లేష్, చుంచుల మల్లేశ్వరి, బత్తిని జనార్దన్, ఎల్క ఉషన్న, నిర్మల, అనిల్, గణేష్ పాల్గొన్నారు.