Wednesday, 4 November 2026

నిరుపేద మైనారిటీలకు చేయూత రంజాన్ తోఫాలను పంపిణీ

 

 

 

 

 

 

జనం సాక్షి ఏప్రిల్ 18 ముప్కాల్రంజాన్ తోఫాలను అందజేసిన ఎంపీపీ సామ పద్మ – వెంకట్ రెడ్డి జెడ్.పి.టి.సి బద్దం నర్సవ్వ – నర్సారెడ్డిపవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రంజాన్ గిఫ్ట్ ప్యాక్ లను ముప్కాల్ ఎంపీపీ సామ పద్మ- వెంకట్ రెడ్డి జడ్.పి.టీ.సీ బద్దం నర్సవ్వ – నర్సారెడ్డి, ముస్లిం సోదరులకు అందించారు
_ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ఉపవాసం దీక్షతో భక్తిశ్రద్ధలతో అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్ని మతాలను గౌరవిస్తూ బతుకమ్మ పండుగకు, క్రిస్మస్ వేడుకలకు, రంజాన్ పండుగకు, పేద కుటుంబాలకు బట్టలు పంపిణీ చేయడం గొప్ప విషయం అని కొనియాడారు
_పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రజలందరూ ఆనందంగా పండుగను జరుపుకోవాలని అన్నారు.
అంతే కాకుండా ఈ సారి రంజాన్ పవిత్ర పర్వదినాన్ని ప్రతి ముస్లిం ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రతిఏటా రంజాన్ తోఫాలను పంపిణీ చేస్తున్నారన్నారు. మంగళవారం ముప్కాల్ మండలంలో గల రైతు వేదికలో ముస్లింలకు రంజాన్ తోఫాలను ఎంపీపీ జడ్.పి.టీ.సీ పంపిణీ చేశారు
దేశంలో హిందు, ముస్లిం, క్రిస్టియ‌న్ల‌కు స‌మానంగా చూస్తూ వారి వారి పండుగ‌ల‌కు అనేక రకాల కానుక‌లు అందిస్తున్న ఏకైక ప్ర‌భుత్వం బిఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే అన్నారు.
_ముస్లింల కోసం మైనార్టీ క‌ళాశాల‌లు, పాఠ‌శాల‌లు, గురుకులాలు, షాదీ ముబార‌క్‌, మోజంల‌కు జీతాలు ఇలా ఎన్నో పనులు సీఎం చంద్రశేఖర్ రావు ప్ర‌వేశ పెట్టార‌న్నారు. మత సామరస్యానికి ప్రతీకగా తెలంగాణ సర్కారు వివిధ కార్యక్రమాలు చేపడుతోందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు
*మైనారిటీ సోదరులు ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ కి మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆకుల చిన్న రాజన్న, ముప్కాల్ ఎంపీటీసీ.2 నాయకుడు పద్మ, కో ఒప్షన్ , వేంపల్లి సర్పంచ్ ఉప సర్పంచ్ జక్క గంగాధర్, ఏం.ఆర్.ఓ విక్రమ్, ఆర్.ఐ గంగాధర్, అన్ని గ్రామాల మైనారిటీ సోదరులు, పార్టీ నాయకలు, తదితరులు