జనం సాక్షి ఏప్రిల్ 18 ముప్కాల్ మండల కేంద్రంలోని ఆయా గ్రామాలలబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నట్లు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ముస్కు భూమేశ్వర్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా మంగళవారం రోజు ఉదయం పార్టీ కార్యాలయం ఆవరణలో తోటి పార్టీ కార్యకర్తలతో కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.మండల కేంద్రంతో పాటు మండలంలోని వెంచిర్యాల, రెంజర్ల గ్రామాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి ఆర్ధిక సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.పంపిణీ అనంతరం లబ్ధిదారులు సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు పెంటు గంగాధర్, వైస్ ఎంపీపీ ఆకుల చిన్న రాజన్న, కో అప్షన్ సభ్యులు మునిరోద్దీన్, ఆయా గ్రామాల సర్పంచులు ఆకుల రాజేశ్వర్, మట్ట సందీప్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బ్రమ్మదండి లింగం, విజ్ఞేష్ గౌడ్, పుట్టి ప్రదీప్, గద్దల సాయిలు, చిన్న బాల్ రాజ్, రఫీ తదితరులు పాల్గొన్నారు





