హుజూర్ నగర్ ఫిబ్రవరి 13 (జనంసాక్షి): పశువులకు ముద్ద చర్మ వ్యాధి రాకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలని హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి అన్నారు. సోమవారం ప్రాంతీయ పశు వైద్యశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పశువులకు ముద్ద చర్మ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వైద్యశాలలో ఉచితంగా చికిత్స చేయించుకోవాలని సూచించారు . అనంతరం మండల పశువైద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వైద్య శిబిరం ఏర్పాటుకు మున్సిపల్ చైర్ పర్సన్ 50వేల రూపాయలు విరాళాన్ని అందజేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కే ఎల్ ఎన్ రెడ్డి, పశువైద్యాధికారులు రూప్ కుమార్, మమత పాల్గొన్నారు.




