Wednesday, 4 November 2026

సేవనిజాయితీ చాటిన 108 సిబ్బంది

కొత్తగూడ జూన్ 14 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రానికి సమీపంలోని చిలుకమ్మ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం….గాయపడ్డ తాళ్లపల్లి కళావతి వీరన్న లు వీరు భద్రాద్రి కొత్తగూడెం నుండి (పాకాల కొత్తగూడ) మీదుగా వరంగల్ వైపు వెళ్తున్న బైక్ కొత్తగూడ చిలకమ్మ నగర్ ప్రాంతంలో అదుపుతప్పి రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలు కావడంతో దంపతులు ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు.స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించడంతో పైలట్ గోవర్ధన్ టెక్నీషియన్ మహేందర్ సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని నర్సంపేట ప్రభుత్వ ఏరియా ఆరోగ్య కేంద్రానికి తరలించారు.ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తుల వద్ద సుమారుగా రూ/- 51330 పైన నగదు విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి.అట్టి విలువైన వస్తువులను వారి బంధువులకు అందించడం జరిగింది.సేవతో పాటు నిజాయితీని చాటుకున్న 108 సిబ్బందిని స్థానికులు అభినందించారు.