Monday, 2 November 2026

నిరుపేద విద్యార్తిని కి చేయూత

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : క్యాతనపల్లి మున్సిపాలిటీ లోని రామకృష్ణాపూర్ 14వ వార్డ్ మల్లికార్జున్ నగర్ కు చెందిన ఐదో తరగతి విద్యార్థిని ఏల్పుల రవిశ్రేనికి విశాఖ ట్రస్ట్ ద్వారా రూ.10వేల ఆర్థిక సాయం అందించారు. పట్టణానికి చెందిన ఒక ప్రైవేటు స్కూల్లో ఐదో తరగతి పూర్తి చేసిన రవిశ్రేనీ, ఇటీవల మోడల్ స్కూల్ స్కూల్లో 6వ తరగతిలో జాయిన్ అయ్యేందుకు అవకాశం దక్కించుకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన రవిశ్రేనీకి తండ్రి చనిపోవడంతో తల్లి స్వరూప కూలీ పనిచేస్తూ బిడ్డలను సాకుతుంది. ప్రైవేటు స్కూల్లో విద్యార్థినీ డ్యూ ఫీజును చెల్లించలేని కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న బీజేపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ జంగపెల్లి మల్లయ్య, వైద్య శ్రీనివాస్ లు మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకవెళ్లడంతో, ఆయన స్పందించి బాలికకు విశాఖ ట్రస్ట్ ద్వారా పదివేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించగా, బుధవారం ఆ మొత్తాన్ని బీజేపీ లీడర్లు బాలిక రవిశ్రేనీకి అందించారు.
ఈ సందర్భంగా విద్యార్థిని కుటుంబీకులు వివేక్ వెంకటస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.