వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బీద ఆర్య వైశ్య మహిళలకు ఫించన్ పధకం
మిర్యాలగూడ, జనం సాక్షి. వాసవి క్లబ్ వనిత, కూసుమంబ ల ఆధ్వర్యంలో బీద ఆర్యవైశ్య మహిళలకు ఫించన్ పధకాన్ని ప్రారంభించడం గొప్ప విషయమని రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా నాయకురాలు, వాసవీ క్లబ్ రీజినల్ చైర్మన్ రాయపూడి భవాని అన్నారు. మంగళవారం వాసవి భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆమె ముఖ్య అతిధి గా పాల్గొని మాట్లాడుతూ 2023 జనవరి నుండి డిసెంబర్ వరకు క్లబ్ ఎంపిక చేసిన 30 మంది నిరుపేదలకు ప్రతినెలా 10 వ తేదీన అందిస్తామన్నారు ఈ పధకానికి వాసవీ క్లబ్ వనిత, కుసుమాంబ సభ్యురాళ్లు టి శైలజ,జి శారద,వి జ్యోతి,మారం పద్మ,కొండూరు ఇందిర,సీ హెచ్ వనజ, టి రోజా రాణి,జి సరోజ లు ఆర్ధిక సహాయం అందిస్తున్నారని ఈ సందర్బంగా వారికి భవాని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో పట్టణ వాసవీ క్లబ్ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బీద ఆర్య వైశ్య మహిళలకు ఫించన్ పధకం




