ఏటూరునాగారం (జన సాక్షి),మే 06.ములుగు నియోజక వర్గం లో పి. ఆర్ రోడ్లు, ఆర్&బి, ఐటిడిఎ ఇతర రోడ్లకు నిధులు మంజూరు అయినప్పటికీ కాంట్రాక్టర్లు నిర్లక్షం గా వ్యవహరిస్తు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని పనులు జరిగే విధంగా చోరువ చూపాలని కొంత మంది కాంట్రాక్టర్లు 5,లేదా 6 వర్కులు తీసుకొని పనులు చెయ్యడం లేదని నిర్లక్షం గా వ్యవహరిస్తున్న వారికి నోటీస్ లు ఇవ్వాలని వర్షాకాలం సమీపిస్తోంది ప్రజలకు రోడ్లు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు.
పనులు తీసుకున్న కాంట్రాక్టర్లు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసి కొత్త పనులకు త్వరగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పనులు జరిగే విధంగా అధికారులకు కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సీతక్క అన్నారు.




