ఏలూరు,నవంబర్15(జనంసాక్షి): భూములు కోల్పోతున్న రైతులతో ఏలూరు ఎంపి మాగంటి బాబు గురువారం సమావేశమయ్యారు. కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామాల్లో గత వారం రోజులుగా తమ భూములకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతులు నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతు తెలుపుతూ ఏలూరు ఎంపి మాగంటి రైతులతో చర్చించారు. వారి సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని రైతులకు హావిూ ఇచ్చారు.




