Friday, 6 November 2026

మద్యం నియంత్రణకు ఉద్యమించాలి

మద్యం నియంత్రణకు ఉద్యమించాలి

విజయనగరం,నవంబర్‌15(జ‌నంసాక్షి): మద్యం నియంత్రణ కోసం మహిళలంతా ఐక్యంగా ఉద్యమించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షలు బి.ప్రభావతి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఎల్బీజీ భవనంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు పి.రమణమ్మ అధ్యక్షతన జరిగిన జిల్లా సదస్సుల్లో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. రమణమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల మద్యం నియంత్రణ జరగడం లేదన్నారు. మద్యం కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని, మహిళలపై పెరుగుతున్న హింస, వేధింపులకు మద్యమే కారణమని చెప్పారు. అత్యాచారాలు, పరువు హత్యలు లేని సమాజాన్ని

నిర్మించాలని, మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలకు మహిళలంతా సిద్ధం కావాలని రమణమ్మ పిలుపునిచ్చారు. ఈ సదస్సులో జిల్లా కార్యదర్శి వి.లక్ష్మీ, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.