Tuesday, 3 November 2026

నివాళులర్పిస్తుంటే బాంబు పేలింది.. 30 మంది మృతి

pakistabnచనిపోయిన ఓ వ్యక్తికి నివాళులర్పిస్తుండగా బాంబు పేలుడు సంభవించి 30 మంది మరణించిన ఘటన పాకిస్థాన్ లోని క్వెట్టాలో జరిగింది. బిలాల్ అన్వర్ కాషీ అనే పేరొందిన లాయర్ ను కొంతమంది ఈ ఉదయం కాల్చిచంపేశారు. ఆయనను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. అక్కడ ఆయన చనిపోయారు. ఆ ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి ఆయన మరణవార్త తెలీగానే ఆయనను స్మరిస్తూ ప్రార్థన చేస్తున్నారు. అంతలో బాంబు పేలింది. 30 మంది మరణించి మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తర్వాత కొంతమంది దుండగులు కాల్పులు జరిపి మరికొంతమందిని చంపేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *