Wednesday, 4 November 2026

నిషేదిత (బీటి-3) నకిలీ పత్తి విత్తనాలు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

 

 

 

 

 

-ముగ్గురు నిందితుల అరెస్ట్, పరారీలో ఇద్దరు.-5 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు, మహేంద్ర బొలెరో, టాటా విస్టా కారు స్వాదీనం.ఫొటో : పట్టుకున్న నిందితులతో టాస్క్ ఫోర్స్ పోలీసులు.బెల్లంపల్లి, ఫిబ్రవరి 11, (జనంసాక్షి )
కల్తి, నకిలీ విత్తనాలను రూపుమాపి రైతుకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలకు, ఆదేశాలకు అనుగుణంగా రైతులను నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాల సరఫరా జీరో స్థాయికి తీసుకరావడం, సమూలంగా నిర్ములించడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి టాస్క్ ఫోర్స్ బృందాలు, స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది పని చేయడం జరుగుతుందని టాస్క్ ఫోర్స్ సీఐ అశోక్ కుమార్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల తాండూర్ గ్రామ శివారు నుండి కొంతమంది బారత ప్రభుత్వ ఉత్తర్వు NO.6-2/2017-SD.IV(pt) నిబందనలను ఉల్లంఘిస్తూ నిషేధిత (బిటి-3) నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్నారనే నమ్మ దగిన సమాచారం మేరకు సిపి టాస్క్ ఫోర్స్ ఎస్సై లచ్చన్న, సిబ్బంది లతో కలిసి, బోయపల్లి బోర్డు వద్ద మంచిర్యాల వైపు వస్తున్న కారు మరియు బొలెరో ట్రాలీ వాహనం ఆపి వారిని తనిఖి చేయగా బొలెరో ట్రాలి వాహనం లో పైన వడ్ల బస్తాలు వేసుకొని వాటి క్రింద సుమారు 10,00000/- విలువైన 5 క్వింటాళ్ల ప్రభుత్వ నిషేధిత (బిటి-3) నకిలీ విత్తనాలు గుర్తించడం జరిగిందన్నారు. అనంతరం వారిని విచారించగ వారి పేర్లు శ్రీరాముల నవీన్, ఒడ్నాల రాకేష్, మోర్ల వెంకట స్వామి, అట్టి పత్తి విత్తనాలు కొడిపాక రంజిత్, గాండ్ల మహేష్, రెచిని, తాండూర్ అనే వ్యక్తులు వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి అమాయకపు రైతులకు ఎక్కువ ధరకు అమ్ముట కొరకై తీసుకువెళ్తున్నానని తెలిపారు. ఇట్టి వ్యక్తులపై Sec. 420 IPC. 19 of seeds act 15(1) of Environmental Protection act ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు. పట్టుకున్నవారిలో శ్రీరాముల నవీన్ గ్రామం రేచిని, మండలం తాండూర్. ఒడ్నాల రాకేష్ గ్రామం కొమురవెల్లి, మండలం రెబ్బన. మోర్ల వెంకట స్వామి గ్రామం భీమిని ఉన్నారని మరో ఇద్దరు నిందితులు కోడిపాక రంజిత్ గ్రామం రెచిని, మండలం తాండూర్. గాండ్ల మహేష్ గ్రామం రెచిని, మండలం తాండూర్ పరారిలో ఉన్నారని వివరించారు. తదుపరి విచారణ నిమిత్తం నకిలీ పత్తి గింజలను సరఫరా చేయడానికి ఉపయోగించిన బోలోరే ట్రాలి, ఎస్కార్ట్ గా ఉపయోగించిన కారు లను మరియు నకిలీ (బీటి) పత్తి విత్తనాలను స్వాదీన పర్చుకొని, స్వాదిన పర్చుకున్న వాటిని మరియు నిందితులను తాండూర్ పోలీస్ వారికి అప్పగించడం జరిగిందన్నారు.