నీల్వాయిలో గ్రామసభ..
వేమనపల్లి,నవంబర్ 07,(జనంసాక్షి):
వేమనపల్లి మండలములోని నీల్వాయి గ్రామపంచాయతీలో సర్పంచ్ గాలిమధు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నీల్వాయి ఎంపీటీసీ రుద్రబట్ల సంతోష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా టెక్నికల్ అసిస్టెంట్ కృష్ణమోహన్ మాట్లాడుతూ 2023-2024 సంబంధించిన పనులు గుర్తించి ఉపాధిహామీ పనుల ఎంపిక పూర్తిచేసి సిద్ధం చేసుకుందామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్, క్షేత్ర సహాయకులు కిషన్,వార్డ్ సభ్యులు, సీనియర్ మేట్స్,కో ఆప్షన్ మెంబర్, గ్రామస్తులు పాల్గోన్నారు.




