నీళ్ళపల్లి ఏకాంబరి రామలింగేశ్వరస్వామి ఆలయానికి రూ.1 కోటి మంజూరు.
కోటి రూపాయలతో ఆలయంలో మౌలిక సదుపాయాలు.
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి.
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
తాండూరు డిసెంబర్ 5(జనంసాక్షి)నీళ్ళపల్లి ఏకాంబరి రామలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసిందని ఆ నిధులతో ఆలయంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే చేపట్టిన పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమం ఈరోజు బషీరాబాద్ మండలం ఏకాంబరి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవస్థానాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కమిటీ సభ్యులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి కోటి రూపాయలు మంజూరు చేసినందుకు కమిటీ సభ్యులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.
నీళ్ళపల్లి ఏకాంబరి రామలింగేశ్వరస్వామి ఆలయానికి రూ.1 కోటి మంజూరు




