Wednesday, 4 November 2026

నూతనంగాభువనగిరి మండల అధ్యక్షునిగాజంగయ్య ఎన్నిక

కుంభంను కలిసిన జంగయ్య యాదవ్…..
భువనగిరి టౌన్ జనం సాక్షి)-
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా ఎంపికైన ఎల్లంల జంగ&య్య యాదవ్ గురువారం హైదరాబాదులోని గాంధీభవన్ లో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. కాగా ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు జంగయ్య యాదవ్ ను అనిల్ కుమార్ రెడ్డి పూలమాల శాలువాతో సన్మానించారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కుంభము అనిల్ కుమార్ రెడ్డిని పూలమాల శాలువాతో మండల నాయకులు సన్మానించారు. నూతనంగా ఎన్నికైన జంగయ్య యాదవ్ మాట్లాడుతూ భువనగిరికిలపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేందుకు అందరిని కలుపుకొని పనిచేస్తానని తెలిపారు. తను ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కోట పెద్ద స్వామి, మండల సీనియర్ నాయకులు వల్లం దాసు ఆదినారాయణ, శ్రీరాములు ఎడ్ల శ్రీనివాస్, చిన్నం శ్రీనివాస్, మట్ట శంకర్ బాబు, బల్ద ఐలయ్య, బొల్లెపల్లి అశోక్, మైలారం వెంకటేష్, చుక్క స్వామి, విట్టల్ వెంకటేష్, ఓరుగంటి నాగయ్య గౌడ్, కోట మహేందర్ చిన్నం శ్రీను స్వరూపంగా నరసింహ చిరంజీవి నాయక్ ఉపేందర్ సుమన్ బాలకిషన్ గౌడ్ లు పాల్గొన్నారు.