Thursday, 5 November 2026

మళ్ళీ మొదలైన విఆర్ఏ ల నిరసన

 

 

 

 

 

 

 

కొత్తగూడ,మే 12 జనంసాక్షి:కొత్తగూడ తహసిల్దార్ కార్యాలయం నందు విఆర్ఏ లు నల్ల బ్యాడ్జిలతో నిరసన…విఆర్ఏల జిల్లా కో కన్వీనర్ దుర్గం రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర విఆర్ఏల జెఏసి కమిటి పిలుపు మేరకు ఈ నిరసనను తెలుపుతున్నామని అన్నారు.ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా విఆర్ఏలకు ఇచ్చిన హామీలు పే స్కేల్,ఇతర హామీలు అమలు కానందున గత 80 రోజుల నుండి ఇప్పటి వరకు జీతాలు ఇవ్వనందున గ్రామానికి సంబందించిన విఆర్ఏ విధులు మాత్రమే నిర్వహిస్తామని తహసిల్దార్ కార్యాలయం అటెండర్,నైట్ వాచ్మెన్,కంప్యూటర్ ఆపరేటర్,డ్రైవర్,ఇతర ఆఫీసుకు సంబంధించిన విదులను నిర్వహించబోమని అన్నారు.అసెంబ్లీలో రెవెన్యూ చట్టం తెస్తున్న సందర్భములో విఆర్ఏల అందరికి పే స్కేల్ ఇస్తామని,వారి వారసులకు తల్లిదండ్రుల స్థానములో వారి పిల్లలకు ఉద్యోగాలు,అర్హత కల్గిన వారికి ప్రమోషన్స్ కల్పిస్తామని,విఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తామని నిండు శాసన సభలో ముఖ్య మంత్రి ప్రకరించారు.విఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగా అన్ని సౌకర్యాలు వస్తాయని గత 24 నెలలుగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము.అర్హత కలిగిన వారికి పదోన్నతులు,వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని అన్నారు.ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగులుగా ఉంటూ సమగ్ర కుటుంబ సర్వే మొదలుకొని నేటి దళితబందు వరకు అనేక ప్రభుత్వ సర్వేలు,సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకపోవడంలో విఆర్ఏలు ప్రదాన భూమికగా పోషిస్తున్నాము.నూటికి తొంబై శాతం మందికి పైగా సామాజికంగా, ఆర్థికంగా దళిత,వెనుకబడిన వర్గాలకు చెందినవారమే ఎక్కువ మంది ఉన్నాము.పెరుగుతున్న నిత్యావసరధరలకు వచ్చే అత్యల్ప వేతనాలతో విఆర్ఏల కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తూ,వచ్చే జీతం చాలక అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక అనేక మంది విఆర్ఏ లము చాలా ఇబ్బందులు చెందుతున్నాము.మా విధులు కాకుండా ఇతర విదులు మాకు అప్పగించడం వలన మానసికంగా,ఆర్ధికంగా,శారీరకముగా చాలా ఇబ్బందులు పడుతున్నాము.ఇకనైన ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విధంగా పై స్కేల్,అర్హత కల్గిన వారికి పదోన్నతులు,వారసులకు ఉద్యోగాల జిఓను,సమ్మె కాలపు వేతనం వెంటనే విడుదల చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలుపుతూ,గ్రామాల్లో తప్ప ఎక్కడా విధులు నిర్వహించబోమనే విషయాన్ని తెలియజేస్తూ పలు డిమాండ్స్ తో కూడిన మేమోరాండాన్ని నాయబ్ తహసిల్దార్ కు అందించడం జరిగింది.ఈ నిరసనలో మండల అధ్యక్షులు చెన్నూరి రవి,ఉపాధ్యక్షులు రాధ కృష్ణ,నర్సయ్య,ప్రధాన కార్యదర్శి అల్లెం సాంబయ్య,కోశాధికారి సురేష్,సమ్మక్క,సుశీల,యాకబాబు, తదితరులు పాల్గొన్నారు.