Tuesday, 3 November 2026

మంథని మండలంలో గడపగడపకు బిజెపి

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు, చిల్లపల్లి గ్రామాల్లో మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా గడపగడపకు బిజెపి నినాదంలో బాగంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ మంథని మండల అధ్యక్షులు విరబోయిన రాజేందర్ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారదర్శక పాలనను వివరించి ప్రతి ఇంటికి నరేంద్రమోడీ పథకాలను, వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 73 బూత్ అధ్యక్షులు సాదుల తిరుపతి, దొడ్డిపట్ల శంకర్, మండల నాయలుకు అరే ఓదేలు, బూత్ ప్రధాన కార్యదర్శి కయితి ప్రభాకర్, మండల నాయకులు బూడిద రాజు, అరే ఓదేలు, బూత్ అధ్యక్షుడు కంచు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.