నూతన కలెక్టర్ రేట్ ను సందర్శించిన సి పి విష్ణు యస్ వారియర్
రఘునాథ పాలెం జనవరి 10 జనం సాక్షి
ఈనెల18న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు ఖమ్మం జిల్లా కేంద్రంలో పర్యటించనున్న
నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పార్కింగ్ అంతరాయం కాకుండా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాట్లకు సిద్ధం కావాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. మండలం లో వి.వెంకటాయపాలెం వద్ద నిర్మించిన నూతన సమీకృత కార్యాలయాల భవన సముదాయాని (కలెక్టరేట్) ప్రారంభోత్సవం ఆనంతరం జరిగే భారీ బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా పలువురు జాతీయ, రాష్ట్ర వీవీఐపిలు హాజరుకానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను పరిశీలించేందుకు నూతన సమీకృత కార్యాలయాల భవన సముదాయాని (కలెక్టరేట్) పోలీస్ కమిషనర్ సందర్శించారు. కలెక్టరేట్ పరిసరాలను పరిశీలించారు. హెలిప్యాడ్ స్ధాలం, బహిరంగ సభ వేదిక, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ , అడిషనల్ డీసీపీ (AR) కుమారస్వామి, ఏసీపీలు భస్వారెడ్డి, ప్రసన్న కుమార్, వేంకటేశ్, రెహమాన్, రవి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిఏ రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు




