Wednesday, 4 November 2026

బడి బయటి పిల్లలను బడిలో చేర్పించoడి

బడి బయటి పిల్లలను బడిలో చేర్పించoడి: సుజాత :శామీర్ పేట్, జనం సాక్షి :శామీర్ పేట్ మండలంలోని బొమ్మరాసి పేట్ పరిధిలో మంగళ వారం మండల రిసోర్స్ పర్సన్ సుజాత ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.క్రషర్ మిషన్ వద్ద ముగ్గురు పిల్లలు మధ్యలో బడి మానేసిన వారిని గుర్తించారు.వారిని స్థానిక పాఠశాల లో చేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్థానిక ఉపాధ్యాయులు నర్సింగ్ రావ్ తదితరులు పాల్గొన్నారు.