రాయికోడ్ జనం సాక్షి జనవరి 10రాయికోడ్ మండల కేంద్రంలో మంగళవారం జిల్లా బీసీ సంక్షేమ శాఖఅధికారిజగదీశ్వర్,కంటి వెలుగు ఆఫీసర్స్ మరియు ఎంపీడీవో వెంకటేశం ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమం అవగాహన సదస్సు ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కంటి వెలుగు రెండో విడతకార్యక్రమం ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది కావున వందరోజుల పాటు ఈకార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. కంటి వెలుగు క్యాంపు లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు.కార్యక్రమం సక్సెస్ అయ్యేలా క్షేత్రస్థాయిలో ఊరు,వాడల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరికి కంటి వెలుగు శిబిరాల్లో నేత్ర పరీక్ష నిర్వహించేలా పక్క ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు.అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు పంపిణీ చేయాలని, ప్రజా ప్రతినిధులు, అధికారులందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని మండలంలో నూటికి నూరు శాతం విజయవంతం చేసేందుకు అంకితభావంతో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్వర్,కంటి వెలుగు ఆఫీసర్స్, జెడ్పిటిసి మల్లికార్జున పాటిల్,ఎంప
0రాయికోడ్ మండల కేంద్రంలో మంగళవారం జిల్లా బీసీ సంక్షేమ శాఖఅధికారిజగదీశ్వర్,కంటి వెలుగు




