Tuesday, 3 November 2026

నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలి

నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలి
– తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్
హుజూర్ నగర్ డిసెంబర్ 1(జనం సాక్షి): నూతన జాతీయ విద్యా విధానం, నూతన పింఛన్ విధానాన్ని రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఎస్ టి ఎఫ్ ఐ దేశవ్యాప్త ప్రచార జాతలో భాగంగా టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు హుజూర్ నగర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు జిల్లా అధ్యక్షులు ఎన్ సోమయ్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా పెత్తనం చలాయిస్తుందని విమర్శించారు. ఈ నూతన విద్యా చట్టం కార్పొరేటీకరణకు ప్రైవేటీకరణకు దారితీస్తుందని కావున దానిని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయ రంగాలకు మహమ్మారిగా ఉన్న నూతన పెన్షన్ విధానం సిపిఎస్ ను వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ అనేది బిక్ష కాదు అది ఉద్యోగి హక్కు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు పి. శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి జి. వెంకటయ్య , జిల్లా కార్యదర్శులు ఆర్. దామోదర్, ఆర్ .రవీందర్, ఎన్ సాంబయ్య, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణ, ఉపాధ్యక్షురాలు జ్యోతి , బొల్లం వెంకటేశ్వర్లు, చిక్కుళ్ళ గోవింద్, లక్ష్మీకాంత్, ప్రధానోపాధ్యాయురాలు ఉదయశ్రీ, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.