Tuesday, 3 November 2026

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ

ఆత్మకూర్(ఎం) డిసెంబర్ 1 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆరోగ్య సిబ్బంది ప్రపంచ ఎయిడ్స్ డే దినోత్సవం సందర్భంగా డా విలియమ్ కెరీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఎయిడ్స్ నివారణ అందరి బాధ్యత ఎయిడ్స్ కు మందు లేదు నివారణ ఒక్కటే మార్గం అంటూ ఆరోగ్య సిబ్బంది నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా డాక్టర్ విలియమ్ కెరీ మాట్లాడుతూ మనల్ని మనం పరీక్షించుకోవడం హెచ్ఐవి ని అంతం చేయడానికి సమానతని సాధించడం అని
పేర్కొన్నారు ఎయిడ్స్ పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలి అన్నారు అక్రమ లైంగిక సంబంధాల వలన కలిసిత రక్త మార్పిడి వలన ఎయిడ్స్ సంక్రమిస్తుందని పేర్కొన్నారు ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టి ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణం మనందరి లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్స్ సుపర్వైజర్స్ ఎ ఎన్ మ్ లు ఆశలు వైద్య ఆరోగ్య సిబంది తదితరులు పాల్గొన్నారు