భువనగిరి రూరల్, మే 17(జనం సాక్షి ) కొన్ని సంవత్సరాలనుండి ఎదురు చూస్తున్న మారుమూల గ్రామం నుండి హైదరాబాద్ నడిబొడ్డు కు నూతనంగా బస్ ప్రారంభం…. వివరాల లోకి వెళితే బుధవారం ఉదయం 8:30 గ.లకు ప్రారంభం చేశారు. ఉప్పల్ డిపో బస్ ఉదయం కోఠి నుండి 7:00 గంటలకు బయలుదేరి వయా ఉప్పల్, ఘట్కేసర్, బీబీనగర్ మీదుగా నాగిరెడ్డిపల్లికి 8:30 గంటలకుచేరుకుంటది. తిరుగు ప్రయాణం నాగిరెడ్డిపల్లి నుండి 8:35 బయలుదేరును.ఇట్టి అవకాశాన్ని చుట్టూ పక్కన గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ కోరినారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.





