Thursday, 5 November 2026

బీరప్ప పండుగకి విరాళామందించిన. జంగిటి నరేష్

 

 

 

 

 

 

 

బచ్చన్నపేట (జనం సాక్షి) బచ్చన్నపేట మండలంలోని నారాయణపురం గ్రామంలో ఈనెల 22న జరిగే బీరప్ప కళ్యాణ మహోత్సవానికి విరాళంగా 11.116 రూపాయలు అందించినట్లు అదే గ్రామానికి చెందిన జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ జంగిటి నరేష్ తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్నటువంటి బీరప్ప మహోత్సవానికి అందరూ రావాలని ఆ దేవుడు గ్రామాన్ని ప్రజలను చల్లగా చూడాలని వేడుకున్నారు