సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి లేజర్ కిడ్నీ సెంటర్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. వైద్యాన్ని వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్, డాక్టర్ సాధన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




