నూతన రామాలయం నిర్మాణం శంకుస్థాపన
– ముమ్మరంగా సాగుతున్న బొడ్రాయి విరాళాలు డోర్నకల్ మార్చి/31/జనం సాక్షి న్యూస్:డోర్నకల్ మండలం హున్యతండా గ్రామపంచాయతీ పరిధిలోని బోడహట్యాతండా లో బొడ్రాయి ప్రతిష్టాలో భాగంగా శుక్రవారం గ్రామ పెద్దలు, బొడ్రాయి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, పశువుసంపదాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీరామ మందిరం శంకుస్థాపన చేశారు. అర్చకులు ప్రవీణ్ వారిచే ప్రత్యేక పూజలు,హోమం నిర్వహించి,బోడ హట్యాతండా లో ప్రతి ఇంటి నుండి మహిళలచే కొబ్బరికాయ, పసుపు కుంకుమ, మంగళహారతులు తీసుకొచ్చి నీళ్లబిందెలతో జలాభిషేకం చేసి ఘనంగా నూతన రామాలయం నిర్మాణ శంకుస్థాపన నిర్వహించారు. బొడ్రాయి స్థాపన కోసం ప్రతి ఒక్కరు విరాళాలు అందించి సహకరించగలరని బొడ్రాయి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బొడ్రాయి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు,ప్రజా ప్రతినిధులు,మహిళలు, యువకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నూతన రామాలయం నిర్మాణం శంకుస్థాపన




