Tuesday, 3 November 2026

నూతన శ్రేష్ట డయాగ్నొస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన

డోర్నకల్ జూలై-
(జనంసాక్షి న్యూస్)
వద్ద శ్రేష్ట డయాగ్నోస్టిక్ సెంటర్ ను ఆదివారం డాక్టర్ సిహెచ్ బాబురావు, సర్పంచ్ చేరెడ్డి సమ్మిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ సమీరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి గొల్లచర్ల తో పాటు చుట్టుప్రకాల గ్రామాల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా శ్రేష్ట డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభించడం చాలా సంతోషమని ఆయన అన్నారు. ప్రోపరేటర్ వాంకుడోత్ సుమన్ మాట్లాడుతూ మా శ్రేష్ట  డయాగ్నస్టిక్ సెంటర్లో అన్ని రకాల రక్త, మూత్ర పరీక్షలు చేయబడును ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు స్వాధీనం చేసుకోగలరు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ అధ్యక్షుడు భీమనబోయిన సంతోష్, ఆర్ఎంపీ డాక్టర్లు బిక్షమయ్య, శ్రీను, వరదయ్య, సోషల్ మీడియా ఇన్ఛార్జ్  రాజీవ్, స్థానికులు నాగేష్, రాము,పవన్, సుధాకర్,ప్రశాంత్, కిషన్,శ్రీను,మంగీలాల్, ఓబుల,మెడికల్ షాప్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.