నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించిన పాలెం డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల మిత్రబృందం.
-22సంవత్సరాల నుండి ఆత్మీయ కలయిక.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జనవరి 7 (జనం సాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని పాలెం శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివిన 1998-2001 విద్యాసంత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల మిత్రబృందం శనివారం వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తిరుమలాయ గుట్టమీద గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంను దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ఆవరణలో 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలెం శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2001 విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసుకున్నామని డిగ్రీ మూడేండ్ల లో ఏబీవీపీ విద్యార్థి యూనియన్ తరఫున విద్యార్థుల సమస్యలపై ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని,ఆ క్రమంలో 2001జనవరి 6న 11మంది విద్యార్థులం మిత్రబృందంగా ఏర్పడి అప్పటినుండి ప్రతి సంవత్సరం జనవరి 6 న తప్పనిసరిగా కలుసుకుంటు న్నామని తెలిపారు.ప్రస్థుతం మేమంతా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నామని తెలిపారు. 2002న హైదరాబాద్ లో, 2003 న శ్రీశైలంలో,2004న మంత్రాలయంలో,
2005న సోమశిల లో, 2006న మద్దిమడుగు లో, 2007న హనుమకొండ లో, 2008 న చిలుకూరులో,2009 న మన్యం కొండలో, 2010న నాగర్ కర్నూల్ లో,2011 న శ్రీరంగాపూర్ లో,2012న నాగర్ కర్నూల్ లో,2013 న మారెను మాన్ దిన్నె లో,2014 న అలంపూర్ లో,
2015 న వేములవాడ లో, 2016 న సింగోటంలో, 2017న వనపర్తి లో,
2018న యాదగిరి గుట్ట లో,2019,2020 న నాగర్ కర్నూల్ లో,2021 న మక్తల్ లో, 2022న పామాపూర్ లో,ఈ సంవత్సరం జనవరి 6న వనపర్తి లో కలుసుకోవడం జరిగిందని అన్నారు.ఇందులో భాగంగానే ఈ రోజు దేవాలయం ను దర్శించుకోవడం జరిగిందని అన్నారు.




