లక్ష్మీపురంలో సంక్రాంతి ముగ్గుల సంబరాలు
టేకులపల్లి, జనవరి 15( జనం సాక్షి): మండలంలోని కొప్పురాయి పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించి ఎంతో ఆనందోత్సవహాలతో సంబరాలు జరుపుకున్నారు. లక్ష్మీపురం గ్రామంలోని పటేల్ చీమల నరేష్, దొర పూనెం వీరస్వామి, పెద్ద మనిషి కుంజ రమేష్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు, యువతులు ముగ్గుల పోటీలలో పాల్గొని రోడ్డు పొడవునా రకరకాల రంగులను అద్ది ఎంతో సుందరంగా ముగ్గులను వేసి కనువిందు చేశారు. అనంతరం బహుమతులను ప్రధానం చేశారు.




