Thursday, 5 November 2026

పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
హుజూర్ నగర్ జనవరి 12 (జనం సాక్షి): మండలంలోని అమరవరం గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల నందు ఆల్బాని తెలంగాణ కమ్యూనిటీ (ఏ టి సి) నెట్వర్క్ సెక్రటరీ శ్రీరంగం సురేష్, కో స్పాన్సర్స్ శ్రీరంగం యాదగిరి, శ్రీరంగం స్వాతి లచే బహుకరించబడిన సుమారు లక్ష రూపాయల విలువచేసే మినరల్ వాటర్ ప్లాంట్ ను, ప్రొజెక్టర్ను హుజూర్ నగర్ జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, స్థానిక సర్పంచ్ గుజ్జుల సుజాతఅంజిరెడ్డి, ముక్కా వెంకట నరసింహారావు వారి కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. గురువారం
ఈ సందర్భంగా జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు మంచి శుద్ధి చేసిన తాగునీరు అందించుటకు, డిజిటల్ క్లాసుల కొరకు ప్రొజెక్టర్ అందించిన శ్రీరంగం సురేష్ కి వారి సంస్థకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బృహత్తర కార్యక్రమానికి విశేష కృషి చేసిన ముక్కా సోమశేఖర్ ని అభినందించారు. పాఠశాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. అలాగే వారి ప్రతినిధులైన ముక్కా వెంకట నరసింహారావుని వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మామిళ్ళ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ పి. రమేష్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కోటిరెడ్డి, స్థానిక హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు పి. శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు విజయకుమార్, పురుషోత్తమరావు, సోమశేఖర్, సైదాబీ, వెంకటరమణ రావు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఎండిఎం సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.