నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదు
సైబరాబాద్ సీపీ సజ్జనార్
హైదరాబాద్,డిసెంబరు 25 (జనంసాక్షి):నగరంలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతిలేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. పబ్‌లు, బార్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో విూడియాతో ఆయన మాట్లాడారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని.. వాటిని మరింత విస్తృతం చేస్తామన్నారు. గేటెడ్ కమ్యూనిటీల్లోనూ కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించవద్దని చెప్పారు. వేడుకలు నిర్వహిస్తున్నామంటూ నిర్వాహకులు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని.. పాస్‌లు, టికెట్ విక్రయిస్తే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ¬టళ్లలోనూ వేడుకలకు అనుమతి లేదన్నారు. తమ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని సజ్జనార్ స్పష్టం చేశారు. టికెట్లు విక్రయిస్తున్నట్లు ఎవరైనా చెబితే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.