వేములవాడ, జూన్ 30 (జనంసాక్షి): వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ, జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో వేములవాడ సినారె కళామందిరం ఆవరణలో శుక్రవారం తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన అకాల మృతి తీరని లోటని, భౌతికంగా దూరమైనా పాట రూపంలో తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటాడని ఈ సందర్భంగా కళా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు యెల్లా పోశెట్టి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య గౌరవాధ్యక్షులు బొడ్డు రాములు, సేవా సంస్థ గౌరవాధ్యక్షుడు సోమినేని బాలు, ముగిలోజి లక్ష్మీరాజం, మామిడి సత్తయ్య, సామల ప్రతాప్, కొత్తూరి భాను ప్రతాప్, మేక నరేష్, మల్లేష్, రాజేందర్ తదితర కళాకారులు పాల్గొన్నారు.
నృత్య కళానికేతన్ ఆధ్వర్యంలో సాయిచంద్ కు ఘనంగా నివాళులు




