తిరుమలగిరి (సాగర్), ఏప్రిల్ 26 (జనంసాక్షి):నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమీపంలో నిర్మించే నెల్లికల్ లిఫ్ట్ పనులను బుధవారం ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే నోముల భగత్ పరిశీలించి అనంతరం మాట్లాడుతూ
నెల్లికల్ లిఫ్టు గత పాలకులు మొదటగా 5000 ఎకరాలు సాగునీరు అందించే విధంగా రూపొందించారని, ముఖ్యమంత్రి కేసీఆర్ నెల్లికల్ లిఫ్టును రీ డిజైన్ చేసి 25 వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేయించారని కొనియాడారు.గత పాలకులు గిరిజనులను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు తప్ప గిరిజనుల సమస్యలను తీర్చలేదని అన్నారు.అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి చేయలేని పనిని ముఖ్యమంత్రి కెసిఆర్ సహాయంతో పూర్తి చేస్తున్నామని, గిరిజనుల చిరకాల స్వప్నం నెల్లికలు లిఫ్ట్ వచ్చే సంవత్సరం మే నెల వరకు పూర్తి చేసి గిరిజనులకు సాగునీరు అందిస్తామని తెలిపారు.గతంలో పనులు ప్రారంభించి నా, ప్రాజెక్టులోని నీరు చేరడంతో పనులు చేయడానికి వీలు కాలేదు, ఇప్పుడు రింగ్ బండ వేయించి పనులు ప్రారంభించా మన్నారు.ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షుడు పిడిగం నాగయ్య, ఎంపీటీసీ సుజాత పాండు నాయక్, బట్టు వెంకన్న బావి తండా సర్పంచ్ దేవుడు, గుండాల రవి, జాల్ తండా సర్పంచ్ స్వామినాయక్, మేకపోతుల కార్తీక్, మార్కెట్ డైరెక్టర్ హరికృష్ణ, పెద్దిరాజు, షేక్ బషీర్, యాత్ అధ్యక్షుడు రమేష్ నాయక్, గోడుమడక సర్పంచ్ మల్లికార్జున్, భాను ,కాలేశ్వర్ రావు, బుర్రి బాలనర్సింహా, నెల్లికల్ గ్రామ శాఖ అధ్యక్షుడు బుర్రి శ్రీను, వాట్టాలా కృష్ణా, సక్క నాయక్, పెద్ద వెంకట్ రెడ్డి, శ్రీను, గోపి, రమేష్,మేరావత్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.




