Wednesday, 4 November 2026

నెక్సా షోరూమ్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్(జ‌నం సాక్షి ): నగరంలోని మాదాపూర్‌లోగల నెక్సా షోరూమ్‌లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షోరూమ్‌లోని ఐదో అంతస్థులోగల ఓహెచ్ సాఫ్ట్‌వేర్ కంపెనీని నిర్వహిస్తున్నారు. అయితే… అగ్నిప్రమాదం ఎలా సంభవించిందో తెలియరాకున్నప్పటికీ ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో ఊపిరాడక ఓ పెంపుడు కుక్క మృతిచెందింది. సమాచారమందుకున్న అగ్నిమాపక శాఖకు చెందిన సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.