నెన్నెల 108 సిబ్బందికి ఉత్తమ సేవా పురస్కారం.
నెన్నెల, నవంబర్ 21, (జనంసాక్షి )
ఆపద సమయంలో వేగంగా స్పందించి ప్రాణాలు కాపాడినందుకు నెన్నెల 108 సిబ్బందికి జిల్లా ఉత్తమ సేవా పురస్కారాలు దక్కాయి. ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ వారు అందించే 108 డిస్ట్రిక్ట్ లెవెల్ సేవియర్ అవార్డులను నెన్నెల ఈఎంటి పిల్లి రమేష్, అన్నం తిరుపతి అందుకున్నారు. మంచిర్యాలలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా పోగ్రాం మేనేజర్ సామ్రాట్, ఈఎంఈ కొండల్ రావు, ఎఫ్ సి జనార్దన్ వారికి అవార్డులను ప్రదానం చేసిన అభినందించారు. ఎద్దు దాడి చేసిన కుమ్మేయడంతో తీవ్రంగా గాయపడిన మన్నెగూడెంకు చెందిన రైతును కాపాడినందుకు గాను వారికీ ఈ గౌరవం దక్కింది.
నెన్నెల 108 సిబ్బందికి ఉత్తమ సేవా పురస్కారం.




