హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (భారాస) బహిష్కృ త నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు భాజపాలో చేరికపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ భాజపాలో చేరడం కష్టమే అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఓ హోటల్లో ఈటల మీడియాతో మాట్లాడారు.‘‘ఖమ్మం జిల్లాలో కాం గ్రెస్ బలంగా ఉంది. భాజపా బలంగా లేదు. పొం గులేటి, జూపల్లితో నేను రోజూ మాట్లాడుతున్నాను. వారే నాకు రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నా రు. ఇప్పటివరకు వారిద్దరూ కాంగ్రెస్ లో చేరకుండా మాత్రమే నేను ఆపగలిగాను. భాజపాలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులున్నాయి. ఇప్ప టికీ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న జిల్లా ఖమ్మం. దేశానికి కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని నేర్పిన గడ్డ తెలంగాణ. ఖమ్మంలో వామపక్షాలు, తెలుగుదేశంతో సహా అన్ని పార్టీలుంటాయి. ప్రియాంకా గాంధీని అప్పట్లో పొంగులేటి కలిశారని తెలిసింది. అంతకంటే ముందు పొంగిలేటితో చర్చించానని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.
వారిద్దరూ బిజెపీలోకి రావడం కష్టమే పొంగులేటి.. జూపల్లి నాకే రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నా రు: ఈటల




