అనంతపురం : ఈనెలాఖరులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారని ఏపీ కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను రాహుల్ పరామర్శిస్తారని, బాబు అవినీతిపై 15న హైదరాబాద్ లో పోరు దీక్ష చేస్తామని, ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిన బాబు మాఫియా డాన్ లా మాట్లాడుతున్నారని విమర్శించారు.




