Tuesday, 3 November 2026

నెల్లూర్లులో పొంగిపొర్లుతున్న వాగులు

నెల్లూరు: భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వెంకటాచలం మండలం కాకుటూరు కొత్తచెరువుకు గండి పడింది. దీంతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్థృతితో సర్వేపల్లి కాల్వకట్టకు రెండు చోట్ల గండి పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గూడూరు మండలంలో కుండపోత వర్షం కురుస్తోంది. నాయుడుపేటలో భారీ వర్షం కారణంగా స్వర్ణముఖి నదిలో నీటి ప్రవాహం పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *