Wednesday, 4 November 2026

నెహ్రూకు నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

 జనంసాక్షి, కమాన్ పూర్ : కమాన్ పూర్ మండల కేంద్రంలో కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు ఆధ్వర్యంలో భారత దేశ తొలి ప్రధానమంత్రి,స్వాతంత్ర్య సమరయోధులు, భారతరత్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా శనివారం వారి చిత్రపటానికి కమాన్ పూర్ మండల కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి నెహ్రూ చేసిన సేవలు మరువలేనివి అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రంగు సత్యనారాయణ గౌడ్, భుంపెల్లి రాజయ్య,షేవ్వశంకరయ్య,సయ్యద్ ఇక్బాల్,కొంతం శ్రీనివాస్, లింగాల కుమార్, గుండేటి శ్రీ మూర్తి, అఫ్సర్, పెండ్యాల రాజు, పిడుగు శoకర్, చొప్పరి శేఖర్, అకేనపల్లి సుధాకర్ గౌడ్ ,కుక్క రవి, ఇరుగురల శేకర్,చిప్పకుర్తి కనుకయ్య, దబ్బెట రాజేష్, రంగం చంద్రయ్య, తదితరులు ఉన్నారు.