దౌల్తాబాద్ మే 27, జనం సాక్షి.పూసల గోడును ప్రభుత్వానికి వినిపించేందుకు మే 28 న కరీంనగర్ లో నిర్వహించే పూసల సమర శంఖారావం సభను విజయవంతం చేయాలని పూసల సంఘం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు ముద్రకోళ్ల యాదగిరి పిలుపునించారు. ఈ సభకు ముఖ్య అతిధులుగా రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్,రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ హాజరవుతారని తెలిపారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా పూసల కుల సమస్యలతో పాటుగా ఎంబిసి మరియు డిఎన్టి సాధనకై పూసల సమర శంఖారావం వాసరా గార్డెన్ లో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పూసల కులస్థుల సమస్యలు పరిష్కారం కావాలని డీఎన్టీలో,ఎంబిసిలో చేర్చాలని ఈ సభ ద్వార రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా చేయాలని అన్నారు. సిద్దిపేట జిల్లా నుంచి అధిక సంఖ్యలో పూసల కులస్థులు పాల్గోని సభతో ఐక్యతను చాటి సమస్యల పరిష్కార దిశగా ఒక వేదిక ఏర్పాటు చేసుకోవడం కోసం కూడా ఉపయోగపడుతుంది అని అన్నారు.
పూసల సమర శంఖారావం విజయవంతం చేయండి – సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు ముద్రకోళ్ల యాదగిరి.




