నేటి బాలలే రేపటి పౌరులు
– పిడిఎస్యు నాయకులు రవి
మునగాల, నవంబర్ 14(జనంసాక్షి): మండలంలోని కొక్కిరేణి గ్రామంలోని అంగన్వాడి -2లో బాలల దినోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి ప్రధానమంత్రి, జవహర్ లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. చిన్నపిల్లలంటే జవహర్ లాల్ నెహ్రూకి అమిత ప్రేమ అని, నేటి బాలలే రేపటి పౌరులని తెలిపారు. పిల్లల దినోత్సవాన్ని పురస్కరించుకొని చాక్లెట్ లు, కొన్ని ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి పౌరులుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో. ప్రభుత్వ ఉపాధ్యాయులు కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్, కట్టెబోయిన విజయలక్ష్మి, గాంధీ కళాశాల మెడికో కట్టెబోయిన తేజస్విని, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.




