నేటి యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలి హుజూర్ నగర్ జనవరి 12 (జనం సాక్షి): నేటి యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలని వివేకానంద విగ్రహ కమిటీ అధ్యక్షులు పశ్య శ్రీనివాస్ రెడ్డి, సీఐ రామలింగారెడ్డి లు అన్నారు. గురువారం 161 వ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలిశెట్టి లక్ష్మీనరసింహారావు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశ సంస్కృతిని చాటిన మహనీయుడు అన్నారు. భారతదేశానికి మార్గదర్శి శ్రీ స్వామి వివేకానంద అని అన్నారు. యువత సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించి ఆచరించాలని చెప్పారు. పెడదోవ పడుతున్న యువతను సరైన మార్గంలో పెట్టేందుకు వివేకానందుడి సూక్తులు తోడ్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, సాముల శివారెడ్డి, గజ్జి ప్రభాకర్, కుక్కడపు రామ్మోహన్ రావు, గెల్లి అప్పారావు, గుండా రమేష్, పొట్టుముత్తు దయానంద్, అంకతి అప్పయ్య, తన్నీరు మల్లికార్జున్ రావు, గొట్టే రామయ్య, ఊరే వెంకయ్య, మన్నెం బాల్ రెడ్డి, శ్రీనివాసరాజు, ఎల్లావుల రాములు, పాలకూరి బాబు, ఎస్ఐ కట్టా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేటి యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలి




