పట్టణంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి హుజూర్ నగర్ జనవరి 12 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి అధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుక నిర్వహించారు. గురువారం ఈ సందర్భంగా వేముల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ యువత స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద 161 వ జయంతి సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మండల అధ్యక్షులు కుందూరు కోటిరెడ్డి, గుండా గోపి, మంద వెంకటేశ్వర్లు, చింతలపూడి ఉమా మహేశ్వర రావు, పులి నరసింహ, తిరిపిశెట్టి నాగేశ్వరరావు, కొప్పుల శంభిరెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి




