శాంతిఖని గనిలో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఇంప్లిమెంటర్ మానిటర్ అవగాహన సదస్సు.
బెల్లంపల్లి, జనవరి 12(జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో గురువారం సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అమలు, పర్యవేక్షణ యొక్క పాత్రను క్షుణ్ణంగా వివరించారు. కార్పొరేట్ జీఎం గురువయ్య ఆదేశాల మేరకు గని ఆవరణలో రక్షణ సదస్సు నిర్వహించారు. సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అమలు మరియు పర్యవేక్షణ మీద సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సదస్సులో బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం జాన్ ఆనంద్, మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్, ఏరియా రక్షణ అధికారి ఓదెలు, ప్రాజెక్టు అధికారి ఆర్ విజయప్రసాద్, ఎస్ఎమ్ టీ సి ఇంచార్జి విజయ్ కుమార్, గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, రక్షణ అధికారి పి రాజు, పిట్ ఇంజనీర్ రాంబాబు, మరియు పిట్ సెక్రెటరీలు దాసరి శ్రీనివాస్, దాసరి తిరుపతి గౌడ్, టీబీజీకెఎస్ నాయకులు సిహెచ్ వెంకటరమణ, రాజనాల రమేశ్, గని అధికారులు, సూపర్ వైజర్లు మరియు టెక్నీషియన్లు పాల్గొన్నారు.
శాంతిఖని గనిలో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఇంప్లిమెంటర్ మానిటర్ అవగాహన సదస్సు.




