Sunday, 8 November 2026

నేడు అమిత్‌షా పర్యటన

– మూడు బహిరంగ సభల్లో పాల్గోనున్న అమిత్‌షా
– ఏర్పాట్లు పూర్తి చేసిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం
హైదరాబాద్‌, నవంబర్‌24(జ‌నంసాక్షి) :  తెలంగాణలో ఎన్నికల ప్రచార సందడి ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచార పర్వాన్ని వేగవంతం చేశాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌, ప్రజాకూటమి నేతలు ప్రచారంలో స్పీడు పెంచారు. అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా, బీజేపీ సైతం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను ప్రచార రంగంలోకి దింపుతుండటంతోంది. ఈ మేరకు అమిత్‌షా ఆదివారం  తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. పలు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. దీంతో అధ్యక్షుడు పాల్గొనే బహిరంగసభలకు భారీ జనసవిూకరణెళి లక్ష్యంగా రాష్ట్ర పార్టీనేతలు కృషిచేస్తున్నారు.
అమిత్‌షా ఆదివారం ఉదయం9గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు. ఉదయం11గంటలకు పరకాల బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్మల్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
అనంతరం 2.30 గంటలకు నారాయణఖేడ్‌లో జరిగే సభలో పాల్గొంటారు. సాయంత్రం 4గంటలకు దుబ్బాకలో జరిగే సభలో పాల్గొంటారు. రాత్రి 8గంటలకు అమిత్‌షా మధ్యప్రదేశ్‌ బయల్దేరి వెళ్తారు. మళ్లీ నవంబర్‌ 28న అమిత్‌షా మరొకసారి తెలంగాణలో పర్యటించనున్నారు.  ఈ పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్‌తో పాటు హైదరాబాద్‌ ప్రాంతాల్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి.