19 శాతం కు అంగీకారం అయ్యింది. ఇంతకు క్రితమే జరిగింది! అలవన్స్ మీద ఈనెల 18,19 తేదీలలో కోల్ కొత లోని కోల్ ఇండియా కార్యాలయం లో చర్చలు జరుగనున్నాయి!10 వ వేతన ఒప్పందం లో 20 శాతం పెరిగింది.అయితే అప్పుడు కనీస పెరుగుదల ప్రయోజనం 4’800 రూపాయలు ఉండగా ఇప్పుడు 7,131 రూపాయలు ఉంటుందని యూనియన్ నేతలు తెలిపారు.అయితే యూనియన్లు 26 లేదా 25 శాతం పెరుగుదల ఉండాలని డిమాండ్ చేయగా,ముందు 14,15 శాతం మాత్రమే పెరుగుదల కోసం యాజమాన్యం సిద్ధం కాగా యూనియన్లు ఒప్పుకో లేదు.చివరికి కనీస పెరుగుదల మీద అంగీకారం కుదరడంతో తో మినిట్స్ డ్రా చేసుకున్నారు. ఇప్పుడు కీలక భూగర్భ,రాత్రి షిఫ్ట్,డస్ట్,హౌస్ రెంట్,మున్సిపల్,ఏజెన్సీ,రిస్క్ లాంటి తదితర పలు ప్రధాన అలవన్స్ ల మీద ఇప్పుడు చర్చలు ఉన్నాయి! హెచ్చెమ్ఎస్ నేత వేతన కమిటీ సభ్యుడు రియాజ్ అహ్మద్ అలవన్స్ మీద యాజమాన్యాలు మొండిగా ఉన్నాయని,తాము ఒత్తిడి సమిష్టిగా చేస్తే దిగి వస్తారన్నారు,జేబీసీసీఐ పర్మనెంట్ సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య,( ఏఐటీయూసీ ) జనక్ ప్రసాద్ ( ఐఎన్ టియుసి ) లక్ష్మారెడ్డి ( బిఎమ్మెస్ ) మాధవ్ నాయక్,సీఐటీయూ నుంచి నర్సింహారావ్,హెచ్ఎమ్మెస్ నుంచి రియాజ్ అహ్మద్ లు సమావేశంలో సింగరేణి యూనియన్ ల నుంచి పాల్గొననున్నారు.సింగరేణి డైరెక్టర్ పర్సనల్,ఫైనాన్స్ బలరాం,జిఎం పెర్సనల్ లు పాల్గొననున్నారు! కార్మికులు ఎంతో ఆత్రుతతో ఈ చర్చల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు! ఏం జరుగుతుందో వేచి చూడాలి! తదితరులు, ఇతర యాజమాన్యంల ప్రతినిధులు ,కోల్ ఇండియా అధికారులు,జాతీయ జేబీసీసీఐ సభ్యులు పాల్గొననున్నారు.ఈ 11 వ వేతన ఒప్పందం 2021 జులై నుంచి అమలులో ఉంటుంది.రిటైర్డ్ కార్మికులు తమ పెన్షన్ పెరుగుదల,వైద్యం కు సంబంధించి సౌకర్యాల మెరుగుదల లాంటి ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నారు!




